
Gold Price Today: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత అనూహ్యంగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. బాండ్ మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులు అధిక రాబడులు, సేఫ్టీ కోసం బులియన్ పెట్టుబడుల్లోకి వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ముందుకు సాగేలా చేస్తుండటమే ప్రస్తుత ర్యాలీకి కారణంగా నిపుణులు అంటున్నారు. వారాంతంలో షాపింగ్ చేయాలని దసరా ముందు భావిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు పెరిగిన రిటైల్ రేట్లను ముందుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 19తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 20న రూ.820 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.82 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 20న):
హైదరాదాబాదులో రూ.11వేల 215
కరీంనగర్ లో రూ.11వేల 215
ఖమ్మంలో రూ.11వేల 215
నిజామాబాద్ లో రూ.11వేల 215
విజయవాడలో రూ.11వేల 215
కడపలో రూ.11వేల 215
విశాఖలో రూ.11వేల 215
నెల్లూరు రూ.11వేల 215
తిరుపతిలో రూ.11వేల 215
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 19తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 20న 10 గ్రాములకు రూ.750 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 20న):
హైదరాదాబాదులో రూ.10వేల 280
కరీంనగర్ లో రూ.10వేల 280
ఖమ్మంలో రూ.10వేల 280
నిజామాబాద్ లో రూ.10వేల 280
విజయవాడలో రూ.10వేల 280
కడపలో రూ.10వేల 280
విశాఖలో రూ.10వేల 280
నెల్లూరు రూ.10వేల 280
తిరుపతిలో రూ.10వేల 280
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 20న కేజీకి వెండి సెప్టెంబర్ 19తో పోల్చితే రూ.2వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 45వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.145 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.