ముంబై: 2025 చివరి ట్రేడింగ్ సెషన్‌లో బుల్స్ ఆధిపత్యం కనిపించింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అర శాతానికి పైగా లాభపడ్డాయి. ఐదు రోజుల పతనం తర్వాత బీఎస్‌ఈ సెన్సెక్స్ 545.52 పాయింట్లు (0.64శాతం) పెరిగి 85,220.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 762.09 పాయింట్లు (0.90శాతం) ఎగిసి 85,437.17 వరకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా నాలుగు రోజుల పతనం తర్వాత 190.75 పాయింట్లు (0.74శాతం) పెరిగి 26,129.60 వద్ద సెటిలయ్యింది. సె
న్సెక్స్ కంపెనీల్లో టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ట్రెంట్ లాభపడగా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా నష్టపోయాయి. 2025లో సెన్సెక్స్ 7,081 పాయింట్లు (9శాతం) పెరగగా, నిఫ్టీ 2,484 పాయింట్లు (10.5శాతం) లాభపడింది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మాత్రం అమ్మకందారులుగా కొనసాగుతున్నారు.
మంగళవారం సెషన్‌లో నికరంగా రూ.3,844 కోట్ల విలువైన షేర్లను వీరు విక్రయించగా, బుధవారం మరో రూ.3,500 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. ఆసియా మార్కెట్లలో కొస్పి, హాంగ్‌సెంగ్ పడిపోయాయి. షాంఘై సూచీ పెరిగింది. యూరప్, అమెరికా మార్కెట్లు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 61.53 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 13 పైసలు తగ్గి 89.88 వద్ద సెటిలయ్యింది. 2025లో రూపాయి విలువ 5 శాతం పతనమైంది.
