
- బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవి
ఆసిఫాబాద్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవి డిమాండ్ చేశారు. లాయర్లకు రక్షణ చట్టం అమలు చేయాలని నిరాహారదీక్ష చేస్తున్న సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ క్రిమినల్ కోర్టు లోని న్యాయవాదులు భోగ అనిల్, హనుమాన్ నాయక్‌పై కక్షిదారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. రోజురోజుకు లాయర్ల పై దాడులు పెరిగిపోతున్నాయని, రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియే షన్ తెలంగాణ స్టేట్ పిలుపుమేరకు విధులు బహిష్కరించినట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చరణ్, లాయర్లు సతీశ్‌బాబు, ముక్త సురేశ్, డి.సురేశ్, నికోడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరాహార దీక్ష చేశారు. జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండవరం జగన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయకపోతే నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రెజరర్ దత్తాత్రేయ, స్పోర్ట్స్ సెక్రటరీ రంగు వేణు కుమార్, లైబ్రరీ సెక్రటరీ రంజిత్ కుమార్ గౌడ్, ఈసీ మెంబర్ శ్రీకాంత్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు రమణారెడ్డి, సంతోష్ గౌడ్, సెల్వరాజ్, ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు.