గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : కలెక్టర్ అభిలాష అభినవ్

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలపై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్​ అండ్​ బీ శాఖల ద్వారా మంజూరైన పనులపై సమీక్ష జరిపారు. ఇప్పటికే చేపట్టిన పనుల పురోగతిని, అటవీ అనుమతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులు అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 ముఖ్యంగా రెవెన్యూ, అటవీ శాఖలు కలసి జాయింట్ సర్వే చేపట్టి, భూవివాదాలు లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సర్వే, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టా లని, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, డీఎఫ్ఓ నాగినిబాను, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.