తుమ్మిడిహెట్టిపై హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి ఉత్తమ్

తుమ్మిడిహెట్టిపై హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి ఉత్తమ్
  • అంచనాలకు ఇంకా ఆమోదమే
  • తెలుపలేదు: మంత్రి ఉత్తమ్​

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు తుమ్మిడిహెట్టిపై మాట్లాడేవన్ని అబద్ధాలేనని, ఆయన అతితెలివితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి, ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుల అంచనాలకు ప్రభుత్వం ఎటువంటి ఆమోదం తెలపలేదని స్పష్టం చేశారు. 

అంచనాలకు ఆమోదం తెలపకముందే రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తూ, 4.47 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిస్తున్నారంటూ హరీశ్ రావు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టంచేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణాలపై అంచనాలు రూపొందిస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని మంత్రి ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి స్పష్టం చేశారు.