
ఒంటారియో: కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇండియా టాప్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. శంకర్ ముత్తుసామి సుబ్రమణియన్ కూడా ముందంజ వేశాడు. గురువారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–-19, 21-–14తో వాంగ్ పో-వెయ్ (చైనీస్ తైపీ)పై వరుస గేమ్స్‌లో గెలిచాడు. 21 ఏండ్ల ముత్తుసామి21-–19, 21–-14 తో చైనా షట్లర్ హువాంగ్ యు-కైపై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో మూడో సీడ్ కెంటా నిషిమోటోతో పోటీ పడనుండగా.. శ్రీకాంత్ టాప్ సీడ్, వరల్డ్ నం.6 చౌ టైన్-చెన్‌ను ఎదుర్కొంటాడు. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో 18 ఏండ్ల శ్రీయాన్షి 21-–12, 19–21, 19–21తో అమిలీ షుల్జ్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది.