రాజేంద్రనగర్ నుంచి ఆప్ అభ్యర్థి హేమ నామినేషన్

రాజేంద్రనగర్ నుంచి ఆప్ అభ్యర్థి హేమ నామినేషన్

శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ సెగ్మెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హేమ జిల్లోజు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.  ఆప్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, సినీ నటి అయిన హేమ జిల్లోజు.. పరమా రెడ్డి కాలనీలోని తన ఇంటి నుంచి రాజేంద్రనగర్ ఆర్డీవో ఆఫీసు వరకు వందలాది మంది నేతలు, కార్యకర్తలతో కలిసి  ర్యాలీగా వచ్చారు. అనంతరం ఆర్డీవో ఆఫీసులో నామివేషన్ వేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కుటుంబ పాలన, బీజేపీ విద్వేష రాజకీయాలు, కాంగ్రెస్ లో నేతల కుమ్ములాటలతో జనం విసిగిపోయారన్నారు. ఈ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. తనను ఎమ్యెల్యేగా గెలిపిస్తే సామాన్యుల  కనీస అవసరాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, నేతలు పాల్గొన్నారు.