
గోవాలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)మాత్రం తన మొదటి జాబితాను ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. ఈ లిస్టులో 10 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. వీరిలో బీజీపీ మాజీ మంత్రి పేరు ఫస్ట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి చెందిన మాజీ మంత్రులు మహదేవ్ నాయక్, అలీనా సల్దాన్హాతో పాటు లాయర్ , పొలిటీషన్ అయిన అమిత్ పాలేకర్ పేర్లు ఉన్నాయి. ఉత్తర గోవా, దక్షిణ గోవా జిల్లాలు రెండింటిలోనూ విస్తరించి ఉన్న 10 మంది అబ్యర్థుల జాబితాను ఆప్ రాష్ట్ర ఇన్ చార్జి అతిషి ఆమోదించారు. గోవా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఫస్ట్ లిస్టును కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. ఇప్పుడు రెండో పార్టీగా ఢిల్లీకి చెందిన ఆఫ్ అవతరించింది.
My best wishes to all the candidates. Goa wants change. https://t.co/7d80zU5FoL
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 7, 2022
మరిన్ని వార్తల కోసం..