కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఏబీ డివిలియర్స్

కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఏబీ డివిలియర్స్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 34వ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, స్నేహితులు అతనికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా  తన బెస్ట్ ఫ్రెండ్  కోహ్లీకి డివిలియర్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.  ఆర్సీబీ ట్విట్టర్లో  బర్త్ డే విషెల్ చెప్పాడు. హలో వి.. మై బిస్కట్.. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి.  ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా..నేను ఇక్కడ కూర్చొని బర్త్ డే విషెస్ పంపడం సరదాగా ఉంది.  పుట్టిన రోజును అద్భుతంగా గడపాలని కోరుకుంటున్నా. కోహ్లీ  నువ్వోక అత్యుత్తమ క్రికెటర్‌ ఆటగాడివి.  అద్భుతమైన మనిషివి..  స్నేహాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. వరల్డ్ కప్లో నీకు..టీమిండియాకు ఆల్ ది బెస్ట్ అంటూ డివిలియర్స్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.  టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ చేరాలి...ఫైనల్లో  సౌతాఫ్రికాను  ఎదుర్కోవాలని ఆశిస్తున్నానని డివిలియర్స్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


ఆర్సీబీ శుభాకాంక్షలు..
విరాట్ కోహ్లీకి  ఐపీఎల్‌ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.  ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కోహ్లీకి బర్త్ డే చెప్తూ  ఆర్ట్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ షేర్ చేసిన ఆర్ట్ వైరల్గా మారింది.