
దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాళ్లలో ఉత్తరాఖాండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. లీగ్ ఏదైనా అభిమన్యు తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 2015 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అయితే టీమిండియా ఎంట్రీ మాత్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరపున తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. దీంతో ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ తన కొడుకు ఐపీఎల్ ఆడకపోవడం వలనే టీమిండియాలో ఇంకా అరంగేట్రం చేయలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
అభిమన్యు ఈశ్వరన్ఐ తండ్రి మాట్లాడుతూ.. "ఐపీఎల్ లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం దొరికితే అభిమన్యు చాలా కాలం క్రితమే టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసి ఉండేవాడు. ఈ టోర్నమెంట్ ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటుంది కాబట్టి భారత జట్టులో తొందరగా చోటు దక్కుతుంది. అభిమన్యు ఆడంబరమైన ఆటగాడు కాదు. పరుగులు చేసిన తర్వాత మైదానంలో పెద్దగా సెలెబ్రేట్ చేసుకోడు. అభిమన్యు 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 48.87 సగటుతో 7,674 పరుగులు చేసిన తీరు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో అతని అనుభవం ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునేలా చేస్తుంది". అని రంగనాథన్ అన్నారు.
ఇంగ్లాండ్‌లో ఉపయోగించే రెడ్ డ్యూక్స్ బంతితో అభిమన్యు ఈశ్వరన్ ప్రాక్టీస్ చేస్తున్నాడని ఆయన అన్నారు. అంతే కాదు, రాబోయే పర్యటన కోసం భారత క్యాప్ ఎలా విస్తృతంగా శిక్షణ పొందిందో తండ్రి వెల్లడించాడు. గ్రీన్ వికెట్‌పై బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లీష్ పరిస్థితులకు ఎలా అలవాటు పడడానికి సిద్ధమవుతున్నాడు అని అభిమన్యు తండ్రి చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమన్యు ఈశ్వరన్ ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యాడు.
జూన్ 20 నుంచి జరగనున్న ఈ సిరీస్ కు ప్లేయింగ్ 11లో కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ లయన్స్ తో జరగబోయే భారత యంగ్ టీంకు కెప్టెన్ గా సెలక్ట్ అయ్యాడు. రెండు అనధికారిక టెస్టుల్లో రాణిస్తే టీంఇండియాలో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.