మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : ఏసీపీ శ్రీనివాస్

మండపాల వద్ద  జాగ్రత్తలు తీసుకోవాలి :  ఏసీపీ శ్రీనివాస్

బోధన్, వెలుగు:  గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. గురువారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

రాత్రివేళల్లో కాపాలా ఉండాలని, కరెంట్ విషయంలో భద్రతా చర్యలు పాటించాలని తెలిపారు. వినాయక నిమజ్జనాల సమయంలో పోలీసులకు సహకరించాలన్నారు. సీఐ వెంకటనారాయణ, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, మారుతి మందిరం చైర్మన్ జి.రాములు, మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు, హిందూముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.