బీఆర్ఎస్​లోకి జయప్రద?

బీఆర్ఎస్​లోకి జయప్రద?

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద త్వరలోనే బీఆర్ఎస్​లో చేరనున్నారు. మహారాష్ట్ర నుంచి ఆమెను ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో బీఆర్​ఎస్ ​చీఫ్ కేసీఆర్ ఉన్నారు. ఇటీవలే జయప్రద ఆయనతో సమావేశమయ్యారు. టాలీవుడ్​నుంచి బాలీవుడ్​కు వెళ్లి టాప్ హీరోయిన్​గా వెలుగొందిన జయప్రదకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. సమాజ్​వాదీ పార్టీ నాయ కురాలిగా జాతీయ రాజకీయాల్లో కీలంగా వ్యవహరించారు. ఆమె చేరికతో బీఆర్ఎస్​కు సినీ గ్లామర్ ​కలిసి వస్తుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

బీఆర్ఎస్​లోకి కౌశిక ​హరి 

రామగుండం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు కౌశిక​హరి బీఆర్ఎస్​లో చేరనున్నారు. శుక్రవారం రాత్రి ప్రగతి భవ న్​లో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుతో ఆయ న సమావేశమయ్యారు. త్వరలోనే రామగుండంలో నిర్వహించే బహిరంగ సభలో తనతో పాటు బీజేపీ నాయకులు పలువురు బీఆర్ఎస్​లో చేరుతారని ఆయన తెలిపారు.