పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ డాక్టర్ శ్రీజ

 పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ డాక్టర్ శ్రీజ
  • స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ 

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో విద్యాశాఖపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోవాలని చెప్పారు. పీఎంశ్రీ స్కూల్స్ మంజూరైన నిధులతో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.

 అనంతరం పదవీ విరమణ పొందిన 8  మంది ఉద్యోగులను సన్మానించారు. కలెక్టరేట్ లోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.