ఎమోషనల్ : పదేళ్లకు బిచ్చగాడిలా భర్త .... భార్య ఏంచేసిందంటే...

ఎమోషనల్ : పదేళ్లకు బిచ్చగాడిలా భర్త .... భార్య ఏంచేసిందంటే...

యూపీలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చూపించుకునేందుకు వచ్చిన భార్యకు పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త కనిపించాడు. ఆస్పత్రి బయటకు బిచ్చగాడి వేషధారణలో కనిపించిన భర్తనుచూసి భార్య కన్నీరుమున్నీరైంది. ఇన్నాళ్లు ఎటు వెళ్లిపోయావ్ అని ప్రశ్నిస్తూ.. మరోపక్క ఏడ్వసాగింది. అయితే, భర్త మాత్రం భార్య ఏడుస్తున్నా పట్టించుకోలేదు. భర్తకు మతిస్థిమితం లేదని తెలుసుకొని ఆమె బోరున విలపించింది. ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది.

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన ఓ మహిళ చికిత్సకోసం నగరంలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి బయట ఓ వ్యక్తి పెద్దగా జుట్టు పెంచుకొని నేలపై కూర్చొని బిత్తర చూపులు చూస్తున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి అతని దగ్గరకు వెళ్లి చూసింది. కొద్దిసేపు తీక్షణంగా అతనివైపు చూసి బోరున విలపించింది. పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త అని గుర్తించి.. అతన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. చిన్నపిల్లాడిలా అతని తలను నిమురుతూ ఆమె కన్నీరు పెట్టుకుంది. గడ్డం పెంచుకొని, మురికి బట్టలతో నేలపై చతికిలబడి కూర్చున్న భర్తను పైకిలేపసాగింది. కానీ, అతనికి మతిస్థిమితం లేకపోవటంతో భార్యను గుర్తించలేక పోయాడు. ఇన్నాళ్లు ఎక్కడికి పోయావు.. నన్ను వదిలి ఎటువెళ్లావు అంటూ భార్య ప్రశ్నించినా భర్త ఏమీ మాట్లాడేలా కనిపించలేదు. మౌనంగా కూర్చుండి పోయాడు.

వెంటనే తనవద్ద ఉన్న మొబైల్‌తో మహిళ తన పిల్లలకు ఫోన్ చేసి కుర్తా తీసుకురావాలని కోరింది. వెంటనే ఓ యువకుడు బైక్‌పై వచ్చి మహిళతో పాటు మానసిక వికలాంగుడిని తన వెంట తీసుకెళ్లారు. స్థానికంగా కొందరు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.