బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి డైరెక్టర్ ఛాంబర్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాటరింగ్ పై చర్యలు తీసుకొని నాణ్యమైన భోజనం అంధించాలని డిమాండ్ చేశారు.  ఇప్పటికే  బాసర ట్రిపుల్ ఐటీ గేటు దగ్గర బీజేవైఎం, వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారో తెలపాలని యాజమాన్యాన్ని నిలదీశారు. స్టూడెంట్ల హెల్త్ కండీషన్ పై అప్ డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని దిలావర్ పూర్ టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లను పరామర్శించేందుకు వెళ్తున్న మహేశ్వర్ రెడ్డిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

మరో వైపు ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జి అవగా..మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు ఆందోళనల చేపట్టి నెల గడవక ముందే మళ్లీ ఫుడ్ పాయిజన్ అవడంతో విద్యార్థుల తల్లింద్రండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ కి కలెక్టర్ సహా ఉన్నతాధికారులు వెళ్లినా తీరు మారలేదని విమర్శిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీలన్నీ జిల్లా యంత్రాంగం, ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గాలికి వదిలేసిందని స్టూడెంట్ల పేరెంట్స్ మండిపడ్డారు.