రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

జూలూరుపాడు, వెలుగు :​ మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామ గిరిజన రైతులకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో  శనివారం వ్యవసాయ యంత్రాల పంపిణీ చేశారు. గిరిజన రైతులకు శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ పథకం వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా గిరిజన రైతు గ్రూపులకు యంత్రాలను అందజేశారు. 

రామచంద్రపురం నుంచి 30 మంది రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి పవర్ టిల్లర్, తైవాన్ స్ప్రేయర్ బ్యాటరీస్, స్ప్రేయర్లు ఉచితంగా పంపిణీ చేశారు. కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ భరత్, హార్టికల్చర్ సైంటిస్ట్ శివ, రైతులు పాల్గొన్నారు.