-
అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గంగాధర్
నిజామాబాద్, వెలుగు: వర్షాలకు తడిసిన వడ్లు బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సూచించారు. సోమవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు సెంటన్‌ను విజిట్ చేసి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. లారీలు, హమాలీ, అన్లోడింగ్ సమస్య రాకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్వో అరవింద్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
