ఇజ్రాయెల్. ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

 ఇజ్రాయెల్. ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

 ఇజ్రాయెల్. ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల తరుణంలో ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.  టెల్ అవీవ్‌కు విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. ఢిల్లీ మరియు టెల్ అవీవ్ మధ్య డైరెక్ట్ విమానాలు ప్రస్తుతానికి నిలిపివేయబడతాయని వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ కు వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది. ప్రస్తుతం వాటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మార్చి 3న టెల్ అవీవ్‌కు సేవలను పునఃప్రారంభించింది. భారతకు చెందిన రెండు ప్రధాన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ ఇరానియన్ గగనతలం నుండి తప్పించుకుంటున్నట్లు ప్రకటించాయి.

 మరోవైపు, ఇజ్రాయెల్పై ఇరాన్ ఆదివారం (ఏప్రిల్ 14) దాడి చేసింది. వందలాది డ్రోన్లు,క్షిపణులతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ అంతటా బూమ్ లు, వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దశాబ్దాల శతృత్వం ఉన్నప్పటికీ ఇరాన్..ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష సైనిక దాడి చేయడం ఇదే మొదటి సారి. ఇరాన్ డ్రోన్లు, క్యూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణు లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ధృవీకరించింది. 

దక్షిణ ఇజ్రాయెల్ లోని బెడౌన్ అరబ్ పట్టణంలో క్షిపణీ దాడిలో పదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు.మరో క్షిపణి ఆర్మీ బేస్ ను  ప్రయోగించారని..స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఎవరికి గాయాలు కాలేదని ప్రకటించింది. ఇరాన్ దాడులను చాలావరకు సమర్థవంతంగా తిప్పికొట్టామని ప్రకటించారు

యుద్ధవాతావరణ తరుణంలో భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్స్ ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది.  ప్రభుత్వం పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితులు బాగోలేవని.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ఎవరూ ఆ రెండు దేశాల్లో పర్యటించటం సురక్షితం కాదని తెలిపింది.

 ఆ రెండు దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో భారతీయ ఎంబసీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇరాన్ లో ఇజ్రాయోల్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయులెవరూ  ఇరాన్ , ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని సూచించింది.