
ఆర్మూర్, వెలుగు: ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం, జిల్లా అధ్యక్షుడు ఎస్. సురేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్ లో ఏఐయూకేఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాలని, రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీతో అందించాలని, బ్లాక్ మార్కెట్ లో నకిలీ మందులను విక్రయించే వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతాంగ సమస్యల కోసం నిరంతరం రైతు సంఘం పోరాటం చేస్తుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. బాబన్న, కార్యదర్శులు ఆర్. దామోదర్, బి.కిషన్, ఆకుల గంగన్న, జిల్లా ఉపాధ్యక్షులు యు. రాజన్న, నాయకులు జే. శేఖర్, ఇ. రమేశ్, టి. గంగాధర్, పాల్గొన్నారు.