లఖింపూర్ హింసకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ... నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. వీడియోల్లో ప్రతీ ఒక్కరూ స్పష్టంగా కనిపిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ నిందితులను ఎందుకో పట్టుకోలేదో చెప్పాలన్నారు. ఈ నెల 12 నుంచి విజయ్ యాత్ర ప్రారంభించనున్నారు అఖిలేష్ యాదవ్. ఎన్నికల వరకు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా విజయ్ యాత్ర సాగనుంది. దీనికోసం ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేశారు. అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి మండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం

