క్వార్టర్ సీసాతో బతుకుతమా?..కాళేశ్వరంతో బతుకుతమా?

క్వార్టర్ సీసాతో బతుకుతమా?..కాళేశ్వరంతో బతుకుతమా?

ఈటల రాజేందర్ ను కేసీఆరే పెంచి పెద్ద చేశారన్నారు మంత్రి హరీశ్ రావు. తమ్ముడని ఈటలను ఆకాశానికెత్తాడని.. కానీ ఈటల తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు చేశారన్నారు. ఇల్లందకుంట మండలం వంతడపుల,  పాతర్లపల్లిలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్..  ఈటల బీజేపీలో చేరారని.. బీజేపీ పెట్రోల్, డీజిల్ ధర రూ.100 దాటించిందన్నారు. గ్యాస్ ధరను రూ. 1000 చేసిందన్నారు. మళ్లీ బీజేపీకి ఓటేస్తే గ్యాస్ ధర రూ.1500 లకు పెంచుతారన్నారు.

రూపాయి బొట్టుబిల్లతో బతుకుమా.. లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మితో బతుకుతమా ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.40 గడియారంతో బతుకుతమా.. రూ. 2016 ఆసరా పెన్షన్ తో బతుకతమా రైతులు ఆలోచించాలన్నారు. క్వార్టర్ సీసా మందుతో బతుకుతమా...కాళేశ్వరం నీటితో బతుకతమా ఆలోచించుకోవాలన్నారు మంత్రి హరీశ్.

మరిన్ని వార్తల కోసం

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?

లఖీంపూర్ అప్డేట్: విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా

పిల్లి పోయిందని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు