విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా

విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు ఆశిష్‌‌ మిశ్రాను యూపీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తరలించారు. లఖీంపూర్‎లో నలుగురు రైతుల మరణానికి ఆశిష్ కారణమంటూ యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు. దాంతో శనివారం ఆశిష్ ను విచారణ నిమిత్తం తీసుకొచ్చారు.  

కాగా.. ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఆశిష్‌‌ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడంపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆశిష్ మిశ్రాను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనపై యూపీ సర్కార్ తీసుకుంటున్న చర్యల మీద కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణను సీబీఐ లాంటి సంస్థలకు అప్పగించడం పరిష్కారం కాదని పేర్కొంది. ఇతర ఏజెన్సీకి కేసును అప్పగించే వరకు ఆధారాలను కాపాడతామని డీజీపీ నుంచి హామీ తీసుకోవాలని యూపీ ప్రభుత్వానికి సీజేఐ సూచించారు. ఈ ఘటన దారుణమని పేర్కొన్న కోర్టు.. నిందితులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారును సుప్రీం ఆదేశించింది.

For More News..

పిల్లి పోయిందని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు