తెలంగాణలో పదేండ్లలో 75 వేల మంది మృతి : ఆకునూరి మురళి

తెలంగాణలో పదేండ్లలో 75 వేల మంది మృతి : ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్లలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 75 వేల మంది చనిపోయారని, 3 లక్షల మందికిపైగా గాయపడ్డారని పేర్కొ న్నారు. అయినా బంగారు తెలంగాణలో గత ప్రభుత్వం ఆ సమస్యను సీరియస్‌‌‌‌గా తీసుకోలేదని పేర్కొంటూ ఆదివారం ట్వీట్ చేశారు. రోడ్ సేఫ్టీకి పనిష్మెంట్ పోస్టింగ్‌‌‌‌గా మొక్కుబడిగా డీజీపీని నియమించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఆ శాఖలో ఒక డీజీపీ, ఇద్దరు పీఏలు, ఒక అటెండర్ తప్ప ఇంకెవరూ ఉండరన్నారు. కనీసం కొత్త ప్రభుత్వమైనా రోడ్ సేఫ్టీకి పూర్తి స్థాయి శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా సీఎం రివ్యూ చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించి వేల మంది ప్రాణాలను కాపాడాలని కోరారు.