
రోజురోజుకూ ఏఐ వినియోగం సాధారణంగా మారిపోతోంది. దీంతో టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు ఏఐ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రముఖ ఏఐ సంస్థ Perplexityతో దీనికోసం ఒప్పందం కుదుర్చుకుంది.
ఎయిర్ టెల్ తన 36 కోట్ల మంది వినియోగదారులకు రూ.17వేలు విలువైన Perplexity Pro ఏడాది సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఇది ఎయిర్ టెల్ మెుబైల్, బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ యూజర్లు ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఏఐ టూల్ జీపీటీ 4.1, క్లాడ్, సీప్ రీసెర్చ్ టూల్స్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్ లోడింగ్ అండ్ అనలసిస్ వంటి సేవలను పొందటానికి వీలు కల్పిస్తుంది.
ALSO READ : IPO News: ఐపీవో వెంటపడ్డ ఇన్వెస్టర్స్.. కంపెనీ అడిగింది రూ.61 కోట్లు, వచ్చిన బిడ్స్ రూ.10వేల కోట్లు..!
భారతదేశంలో జనరేటివ్ ఏఐ రంగంలో ఇదే తొలి అతిపెద్ద కస్టమర్లకు ప్రయోజనం కలిగించే డీల్ అని ఎయిర్ టెల్ ఎండీ గోపాల్ విట్టల్ వెల్లడించారు. తమ ఏఐ టూల్ విద్యార్థులకు రీసెర్చ్ కోసం, రోజువారీ అవసరాలతో పాటు ట్రావెల్ ప్లానింగ్ సహా మరిన్ని అవసరాలకు వినియోగించుకోవచ్చని ఏఐ సంస్థ చెబుతోంది.