పరువు పేరుతో దారుణం..పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన కూతురిని చంపిన పేరెంట్స్

పరువు పేరుతో దారుణం..పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన కూతురిని చంపిన పేరెంట్స్

క్షణికావేశంలో కన్నబిడ్డను చంపేశారు ఆ పేరెంట్స్..కూతురు ప్రేమలో  పడింది..తమకు తెలియకుండా వివాహం చేసుకుంటుందోనన్న భయం..కుటుంబం పరువు పోతుందన్న ఆందోళన ఆ తల్లిదండ్రులను హంతుకులను చేసింది. ఏపీలో పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమలో పడిందని తల్లిదండ్రులు ఆమె గొంతు పిసికి చంపేయడం సంచలనం సృష్టించింది. 

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు టౌన్ కు చెందిన తనూష(23)ను ఆమె తల్లిదండ్రులే గొంతునులిమి చంపేశారని సంచలనంగా మారింది.ఒంగోలు టౌన్  ముంగనూరు రోడ్డులోని విలేకరుల కాలనీలో నివాసముంటున్న రమేష్, లక్ష్మీలకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కూతురు తనూష డిగ్రీ పూర్తి  చేసి కొంతకాలం హైదరాబాద్ లో  ఉద్యోగం చేసింది. ఈ క్రమంలో పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో ప్రేమలో పడింది. ఆమె తల్లిదండ్రులు అయిన రమేష్, లక్షీలకు ఈ విషయం తెలియడంతో గొడవ తలెత్తింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్షణికావేశానికి గురైన రమేష్, లక్ష్మి తనూష గొంతును బలంగా నులిమారు. ఊపిరాడని తనూష ప్రాణం వదిలింది. కాసేపటికి తేరుకున్న రమేష్, లక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీసినట్లు తెలుస్తోంది. 

Also Read : వేరు కాపురం ఉందామంటూ భార్య ఒత్తిడి .. పెళ్ళయ్యి ఏడాది కాకముందే

రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని, కరెంటు లేకపోవడంతో సకాలంలో తాము గమనించలేదంటూ సీన్ క్రియేట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు తనూష మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు. తల్లిదండ్రుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. సీఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన ప్రేమ, వివాహేతర సంబంధాలపై సమాజంలో ఉన్న అసహనాన్ని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరువు పేరుతో జరిగే హింసను హైలైట్ చేస్తుంది. కుటుంబ గౌరవం, సామాజిక కట్టుబాట్లు హింసకు దారితీస్తున్న ఘటనలకు ఉదాహరణ.