
మెదక్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. గురువారం (జూలై 17) మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పర్యటించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి వివేక్.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రూల్స్, డిజైన్ల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని మహిళలందరికి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని.. అన్ని స్కీములలో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తోందని.. రుణాలు తీసుకున్న తర్వాత సరైన టైమ్‌కు డబ్బులు కట్టాలని సూచించారు.
ALSO READ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
ఒక మహిళ ఆర్థికంగా నిలబడితే కుటుంబం మొత్తానికి అండ ఉంటుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని విమర్శించారు మంత్రి వివేక్.