
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. సిట్ నోటీసుల మేరకు 2025, జూలై 24న విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో బండి సంజయ్ సాక్ష్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఫహీం ఖురేషి తదితర నేతల వాంగ్మూలాలను సిట్ తీసుకుంది.
►ALSO READ | కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..హెచ్‌సీఏ సెక్రటరీ, సీఈవోలకు హైకోర్టు ఆదేశం