కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..హెచ్‌‌సీఏ సెక్రటరీ, సీఈవోలకు హైకోర్టు ఆదేశం

కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..హెచ్‌‌సీఏ సెక్రటరీ, సీఈవోలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తమ ఉత్తర్వుల మేరకు పిటిషనర్‌‌కు ఎందుకు డబ్బు చెల్లించలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) కార్యదర్శి దేవరాజ్, సీఈవో సునీల్‌‌ బోస్‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో వారికి ఫామ్‌‌-1 నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేస్తూ జస్టిస్‌‌ నగేశ్‌‌ భీమపాక బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

వర్క్‌‌ ఆర్డర్‌‌ మేరకు పనులు పూర్తి చేసినప్పటికీ రూ.19 లక్షలను హెచ్‌‌సీఏ చెల్లించలేదంటూ గంజం డెకార్‌‌ సర్వీసెస్‌‌ సంస్థ వేసిన పిటిషన్​లో ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని గతంలో జడ్జి ఆదేశించారు. కోర్టు ఆదేశాలను మేరకు నగదు చెల్లించలేదంటూ పిటిషనర్‌‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయడంతో నోటీసులు జారీ అయ్యాయి.