
రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ లోని కార్లకు ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అసలు అలాంటి ప్రమాదమే జరగలేదని మంత్రి వివేక్ పీఆర్వో రమణారావు స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి నర్సాపూర్ వెళ్లారు. ఆ కార్యక్రమానికి వెళుతున్న సమయంలో కాన్వాయ్ లోని కార్లకు ప్రమాదం జరిగిందని.. మంత్రికి తృటిలో ప్రమాదం తప్పిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలు అన్నీ తప్పు అని.. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ కార్లను.. మంత్రి కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు మంత్రి పీఆర్వో రమణారావు
ALSO READ : నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం.. ప్రభుత్వ డిజైన్ల ప్రకారం కట్టుకోవాలి: మంత్రి వివేక్
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఎవరూ ఆందోళన పడొద్దని స్పష్టం చేశారాయన. మంత్రి వివేక్ వెంకటస్వామి క్షేమంగా, సుక్షితంగా ఉన్నారని.. అసలు ప్రమాదం జరగలేదని.. ఎవరూ ప్రమాదం వార్తలను నమ్మొద్దని.. ఆందోళన చెందొద్దని వెల్లడించారాయన.