AndhraKingTaluka: వరుస ప్లాఫ్‍లున్నా మంచి ధరకే.. రామ్ సినిమాకు స్ట్రీమింగ్ దిగ్గజంతో ఓటీటీ డీల్!

AndhraKingTaluka: వరుస ప్లాఫ్‍లున్నా మంచి ధరకే.. రామ్ సినిమాకు స్ట్రీమింగ్ దిగ్గజంతో ఓటీటీ డీల్!

హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్తో సతమతం అవుతున్నాడు. ‘ది వారియర్’,‘స్కంద’,‘డబల్ ఇస్మార్ట్’మూవీలు భారీ డిజాస్టర్స్ అందుకున్నాయి. ఇప్పుడీ హీరో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో స్ట్రాంగ్ హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు.

అందుకు తగ్గట్టుగానే తన అసలైన లవర్ బాయ్ యాంగిల్నే ఎంచుకున్నాడు. పూర్తిగా మాస్ నుంచి బయటకు వచ్చి లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ తరుణంలోనే ఆంధ్రా కింగ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ మ్యాజిక్ జరిగింది. రామ్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా.. ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఓటీటీ వివరాల్లోకి వెళితే..  

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ రెండింటితోనూ మైత్రి నిర్మాతలు చర్చలు జరిపారు. కానీ నెట్‌ఫ్లిక్స్ నుండి మెరుగైన డీల్ పొందిన తర్వాత వారు స్ట్రీమింగ్కి ఒకే చెప్పారు. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ OTTఒప్పందం ద్వారా ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్‌లో కొంత భాగాన్ని తిరిగి పొందడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ తరుణంలోనే ఓటీటీ డీల్ జరిగిపోవడం రామ్కు ప్లస్ పాయింట్ అయింది. అందుకు కారణం లేకపోలేదు. అందులో రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలు పెంచడం ఒకటైతే, మైత్రి నిర్మాతలు ఉండటం మరొకటి. నెట్‍ఫ్లిక్స్లో ట్రేండింగ్లో ఉన్న పుష్ప 2 మరియు 8 వసంతాలు ఈ రెండునూ.. మైత్రి వాళ్లదే కావడం కూడా మరో ప్లస్ పాయింట్ !

Also Read :  ‘కింగ్డమ్‌‌’ సూపర్ ఎమోషనల్ సాంగ్

ఇకపోతే, రేపు (జులై 18న) ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌‌ విడుదల కానుంది. ఇది మెలోడీగా రానుంది. వివేక్ - మెర్విన్ ద్వయం స్వరపరిచిన సౌండ్‌‌ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌‌ని అలరించనుందని టాక్. 

ఈ సినిమాలో ఓ హీరోకు అభిమాని పాత్రలో రామ్ నటిస్తున్నారు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్‍లైన్‍. ఇందులో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.