KINGDOM: ‘కింగ్డమ్‌‌’ సూపర్ ఎమోషనల్ సాంగ్.. ‘అన్నా అంటేనే’ పాట లిరిక్స్ ఇవే

KINGDOM: ‘కింగ్డమ్‌‌’ సూపర్ ఎమోషనల్ సాంగ్.. ‘అన్నా అంటేనే’ పాట లిరిక్స్ ఇవే

విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న చిత్రం ‘కింగ్డమ్‌‌’.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌. బుధవారం ఈ చిత్రం నుంచి ‘అన్న అంటేనే..’అనే పాటను విడుదల చేశారు. ఈ ఎమోషనల్‌‌ సాంగ్‌‌ను అనిరుధ్ రవిచందర్‌‌‌‌ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడాడు.

‘చిన్నతనమే ఏమైపోయే.. నన్ను వదిలే నీదే చేయే.. అంత కలలాగే కరిగే.. కథ కదలక ఆగే.. అందమైన గూడే చెదిరే.. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే.. చిన్నోడి కోసం కలబడతావే..’అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ పాటలో విజయ్‌‌కు అన్న పాత్రలో సత్యదేవ్ కనిపించాడు. ఇద్దరూ తమ బాల్యాన్ని గుర్తు చేసుకునే నేపథ్యంలో వచ్చే పాట అని అర్థమవుతోంది. శ్రీకర స్టూడియోస్‌‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 31న తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల కానుంది. 

అన్నా అంటేనే సాంగ్ లిరిక్స్:

పల్లవి:

చిన్నతనమే ఏమైపోయే..

నన్ను వదిలే నీదే చేయే..

అంత కలలాగే.. కరిగే..

కథ కదలక ఆగే..

అందమైన గూడే చెదిరే..


కష్టమొచ్చినా ఇంకో వైపే..

కంటి రెప్పలా కాసే కాపే..

కొన్ని గుర్తులేవో మిగిలే..

విధి ఎరగదు జాలే..

చిన్న గుండె నాదే పగిలే..


అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..

చిన్నోడి కోసం.. నిలబడతావే..

అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..

చిన్నోడి కోసం.. కలబడతావే..


చిన్నతనమే ఏమైపోయే..

నన్ను వదిలే నీదే చేయే..

అంత కలలాగే.. కరిగే..

కథ కదలక ఆగే..

అందమైన గూడే చెదిరే..

చరణం:

నిశబ్దమే వీడెనుగా..

ఇన్నాళ్లుగా వేచిన వేకువ..

ఇటు వడివడిగా.. నడిచేనే..

నిత్యం ఇలా ఒంటరిగా..

ఉన్నానులే ఊపిరి ఆడక..

కలనా కలవరమా.. ఇది నిజమేనా..


అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..

చిన్నోడి కోసం.. నిలబడతావే..

అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..

చిన్నోడి కోసం.. కలబడతావే..


చిన్నతనమే ఏమైపోయే..

నన్ను వదిలే నీదే చేయే..

అంత కలలాగే.. కరిగే..

కథ కదలక ఆగే..

అందమైన గూడే చెదిరే..