Mahesh Babu : సెంథిల్‌ను పక్కకు తప్పించిన రాజమౌళి.. మహేష్‌బాబు 'SSMB29'లో No ఛాన్స్!

Mahesh Babu : సెంథిల్‌ను పక్కకు తప్పించిన రాజమౌళి.. మహేష్‌బాబు 'SSMB29'లో No ఛాన్స్!

దర్శధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎస్‌ఎస్‌ఎంబీ29 '( SSMB29).  'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.  మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో కూడిన చిత్రం కావడంతో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కొత్త ఆప్ డేట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటున్నారు.  రాజమౌళి కీలక బృందంలో ఒక కీలక మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

'SSMB29' ప్రాజెక్టులో సింథిల్ కు నో ఛాన్స్
రాజమౌళితో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన కేకే సింథిల్ కుమార్ ( KK Senthil Kumar ) 'SSMB29' ప్రాజెక్టులో తాను భాగస్వామ్యం కావడం లేదని స్పష్టం చేశారు.  ఇది దర్శకుడు నిర్ణయం. కొత్త వారితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని భావించినట్లు వెల్లడించారు. ప్రేక్షకులు కూడా వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు సినిమాలు చేయాలనుకుంటారు కదా.. కాబట్టి ఇది మంచి నిర్ణయమని చెప్పుకొచ్చారు.  గతంలో రాజమౌళి-, సెంథిల్ కలిసి పనిచేయడంతో ఎన్నో విజయాలు అందుకున్నారు. 

రాజమౌళితో విభేదాలు లేవు.. 
తమ వృత్తిపరమైన సంబంధంలో ఎటువంటి విభేదాలు లేవని సెంథిల్ స్పష్టం చేశారు. మేము 2003 నుండి కలిసి పని చేస్తున్నాం, కానీ ఎప్పుడూ వరుసగా సినిమాలు చేయలేదు. మధ్యలో విరామాలు కూడా ఉన్నాయి. 'మర్యాద రామన్న' 'విక్రమార్కుడు' చిత్రాలు నేను ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. గతంలో కూడా ఇలాంటి ఖాళీలు వచ్చాయి. కానీ మా సంబంధం అలాగే కొనసాగుతుంది అని ఆయన వివరించారు.  ఒక దర్శకుడు తన క్రియేటివ్ స్పేస్‌లో కొత్త ప్రయోగాలు చేయడానికి స్వేచ్ఛ తీసుకోవడం అవసరమని నొక్కిచెప్పారు.

►ALSO READ | గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు.. ‘ఒక్క రోజు కూడా తేలికగా తీసుకోకండి’ అంటూ పోస్ట్

 'మగధీర', 'ఈగ', 'బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలలో రాజమౌళి, సెంథిల్  కలిసి పనిచేశారు.  వీరిద్దరి ద్వయంతో ఈ తెలుగు చిత్రాలను ప్రపంచ వేదికపై నిలబెట్టడంలో కీలకపాత్ర ప్రోషించారు. ఈ చిత్రాలకు సెంథిల్  కెమెరా పనితనం.. రాజమౌళి విజన్ కు ప్రాణం పోసింది.    ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన నైపుణ్యం స్పష్టంగా కనిపించేది. వారిద్దరూ కలిసి సృష్టించిన దృశ్య కావ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
 
'ఎస్‌ఎస్‌ఎంబీ29' చిత్రంలో మహేష్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా( Priyanka Chopra) , పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran )కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటుడు ఆర్‌. మాధవన్ ( R Madhavan )కూడా ఈ స్టార్-స్టడెడ్ లైనప్‌లో చేరారు.  ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు . ఇది ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.  రాజమౌళి చిత్రాలలో తారాగణం ఎంపిక ఎప్పుడూ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఈ భారీ తారాగణం చిత్రానికి మరింత గ్లామర్‌ను తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు.  ప్రస్తుతం ఈ మూవీ టీం.. షూటింగ్ పనులలో బిజీగా ఉంది.