గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు.. ‘ఒక్క రోజు కూడా తేలికగా తీసుకోకండి’ అంటూ పోస్ట్

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటుడు..  ‘ఒక్క రోజు కూడా తేలికగా తీసుకోకండి’ అంటూ పోస్ట్

బాలీవుడ్ యాక్టర్ ఆసిఫ్ ఖాన్ (34) గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం సడెన్గా హార్ట్ అటాక్ రావడంతో ఆసిఫ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆసిఫ్ పరిస్థితి నిలకడగా ఉందని, కొన్ని రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని బాలీవుడ్ సినీ వర్గాలు వెల్లడించాయి.  'పంచాయత్' వెబ్ సిరీస్‌లో దామద్జీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆసిఫ్.  

ఈ క్రమంలోనే నటుడు ఆసిఫ్ ఖాన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. 36 గంటల నుంచి ఆసుపత్రి రూమ్ ఒక్కటే చూస్తున్నా.. జీవితం ఎంత చిన్నదో అర్ధమవుతుందని తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. “అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను. 36 గంటలుగా ఇక్కడే ఉన్నాను. హాస్పిటల్ పైకప్పు చూసుకుంటూ జీవితం ఎంత చిన్నదో గ్రహించాను.

ALSO READ : Genelia: ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్లపై.. జెనీలియా ప్రశంసల వర్షం

లైఫ్ లో ఏదీ అంతతేలికగా తీసుకోకండి. ఒక్క క్షణంలో ఉన్నట్టుండి అన్ని మారిపోతాయి. మీకు మీరు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండండి. జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో హ్యాపీగా ఉండండి. ఎందుకంటే, జీవితం చాలా చిన్నది. నిజం చెప్పాలంటే అది మనకో వరం.

అందరి ప్రేమ, ఆందోళన మరియు శుభాకాంక్షలు నేను నిజంగా అభినందిస్తున్నాను. మీ మద్దతు నాకు ప్రపంచం లాంటిది. నేను త్వరలో తిరిగి వస్తాను. అప్పటి వరకు, నన్ను మీ ఆలోచనల్లో ఉంచుకున్నందుకు ధన్యవాదాలు’’అని ఆసిఫ్ ఖాన్ తన పోస్ట్ ద్వారా జీవిత సత్యాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆసిఫ్ ఖాన్ చెప్పిన మాటలు ఎంతో అర్ధాన్నిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సినిమాలు మరియు సిరీస్‌లు:

ఆసిఫ్ ఖాన్ అనేక సినిమాలు మరియు సిరీస్‌లలో నటించాడు. ఇందులో పంచాయత్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  'మిర్జాపూర్', 'జామ్తారా', 'పాతాల్ లోక్' మరియు 'దేహతి లడ్కే' వంటి సినిమాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే, 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ', 'పారి', 'పాగ్లైట్', 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ', 'కాకుడ' వంటి తదితర సినిమాలు చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aasif Khan (@aasifkhan_1)