
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా అల వైకుంఠపురంలో.. సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ఏక్తా కపూర్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పాత్రను హిందీలో కార్తిక్ ఆర్యన్ పోషిస్తున్నారు. అయితే సినిమాలో అత్యంత కీలకమైన హీరో అల్లు అర్జున్ తల్లి పాత్ర కోసం మనీషా కోయిరాలాను ఎంపిక చేసినట్లు సమాచారం. తెలుగులో ఈ పాత్రను టాబు చేసిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ లో కూడా ఆమెనే తీసుకుందామని భావించారు. కార్తీక్ ఆర్యన్ తో ఇంత వరకు చేయని నటిని తీసుకుందామని అనుకున్నారు. 'భూల్ భులయ్యా 2'లో కార్తిక్ ఆర్యన్ తో టాబు నటించడంతో ఆమె బదులు కొత్తదనం కోసం టాబు పాత్ర కోసం మనీషా కొయిరాలను ఎంపిక చేశారు ఏక్తా కపూర్. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరో కార్తిక్ సరసన కీర్తి సోనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.