అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా చివరకు ఈ రోజు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. టాటా కంపెనీ కొత్త టెక్నాలజీతో ప్రస్తుత కస్టమర్ల టెస్టుకు తగ్గట్టుగా ఈ సియెర్రా కారును రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, మంచి డిజైన్, కంఫర్ట్ అన్నీ ఉన్నాయి. ఈ SUV కార్ మార్కెట్‌లో ఉన్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఈ మోడల్ పూర్తిగా కొత్తగా, లేటెస్ట్‌గా కనిపిస్తుంది.
కొత్త జనరేషన్ టాటా సియెర్రా ధర రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్‌లు, మూడు పవర్‌ట్రెయిన్ అప్షన్స్, ఆరు కలర్స్ లో డ్యూయల్-టోన్, మోనోటోన్లో వస్తుంది. డిసెంబర్ 16 నుండి బుకింగ్‌లు ఓపెన్ అవుతాయి, డెలివరీలు 15 జనవరి 2026 నుండి ప్రారంభమవుతాయి.
ఇంజిన్ & స్పెసిఫికేషన్లు: టాటా సియెర్రా కొత్త 1.5-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజన్ 158bhp, 255Nm ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్ అప్షన్లో మాత్రమే వస్తుంది. 105bhp, 145Nm ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మోడల్ కూడా ఉంది. దీనికి 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCTతో ఉంటుంది. 1.5-లీటర్ ఫోర్-పాట్ డీజిల్ ఇంజన్ 116bhp, 260Nm ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCTతో ఉంటుంది. టాటా సియెర్రా కోసం AWDని కూడా ప్రకటించింది టాటా కొత్త తరం వాహనాలలో ఈ టెక్నాలజీ ఉన్న మొదటి టాటా మోడల్ ఇదే.
ఇంటీరియర్ & ఫీచర్లు: ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, HUD, కొత్త సెంటర్ కన్సోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు. ఐకానిక్ ఆల్పైన్ రూఫ్, అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంటు పాయింట్లు ఉంటాయి.
టాటా సియెర్రా డిజైన్ హైలెట్స్ లో బాక్సీ సిల్హౌట్, ఆల్పైన్ గ్లాస్ రూఫ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, పూర్తి-LED లైట్ ప్యాకేజీ, బ్యాక్ స్పాయిలర్, సిగ్నేచర్ టాటా గ్రిల్ కొత్త వెర్షన్ ఉన్నాయి. అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS (బ్రేకింగ్ వ్యవస్థ), స్టెబిలిటీ ప్రోగ్రామ్, పిల్లల సీట్ల కోసం ISOFIX మౌంట్లు, కారు పొడవు 4.6 మీటర్లు, వీల్‌బేస్ (ముందు-వెనుక చక్రాల మధ్య దూరం) 2.7 మీటర్లు.
