గోదావరిపై 6 ప్రాజెక్టులకు అనుమతివ్వండి

గోదావరిపై 6 ప్రాజెక్టులకు అనుమతివ్వండి
  • కేంద్ర జలశక్తి మంత్రికి తెలంగాణ వినతి

హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మించే ఆరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ను కోరారు సీఎస్ సోమేశ్ కుమార్. కృష్ణా, గోదావరీ నదీ యాజమాన్య బోర్డులకు సంబంధించి విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై.. తెలంగాణ, ఏపీ సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పంకజ్ కుమార్. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై నిర్మించే సీతా రామ, సమ్మక్క సాగర్, ముక్తేశ్వరం, చౌటపల్లి, మోడికుంటవాగు, చనాక-కొరాట బ్యారేజీకి సంబంధించిన ఆరు డీపీఆర్ లు సమర్పించిందని, కేంద్ర జలసంఘం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని వివరించారు సీఎస్. ఇక గోదావరి నదీ యాజమాన్య బోర్డు జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని ఐదు ప్రాజెక్టులను.. అనామోదిత ప్రాజెక్ట్ ల జాబితా నుండి తొలగించాలని కేంద్ర కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు సోమేశ్ కుమార్. దీంతో ఈ ప్రాజెక్టుల ప్రతిప్రాదనలను పరిశీలించి త్వరలోనే అనుమతి ఇస్తామని జలశక్తి కార్యదర్శి హామీఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే ఎన్ కౌంటర్

MLA,MLCల సమక్షంలోనే టీఆర్ఎస్ నాయకుల కొట్లాట

సుకుమార్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్