సుకుమార్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్ 

సుకుమార్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్ 

హైదరాబాద్: దర్శకుడు సుకుమార్ తనకు మంచి ఆత్మీయుడని.. తాను లేకుండా నేను లేనంటూ అల్లుఅర్జున్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. తన జీవితంలో సుకుమార్‌ ఉంటే ఇలా ఉందని, లేకుంటే మరోలా ఉండేదని నటుడు అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. మంగళవారం ‘పుష్ప’ సినిమా ధ్యాంక్స్‌ మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ' సుకుమార్‌ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియాలి. నా లైఫ్‌ సుకుమార్‌ ఉంటే ఒకలా ఉండేది, లేకపోతే వేరేలా ఉండేది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి మనిషికి 19-20 ఏళ్ల వయసులో క్రాస్‌రోడ్స్‌ వస్తాయి. ఇంజినీర్‌ అయితే ఒకలా, డాక్టర్‌ అయితే మరోలా ఉంటుంది. సినిమాలు చేయాలనుకున్నపుడు ఆర్య చేసినపుడు లైఫ్‌ ఇలా వచ్చింది, ఇంకో సినిమా చేసి ఉంటే లైఫ్‌ ఇంకోలా ఉండేదేమో. నా లైఫ్‌ ఇలా ఐకాన్‌ స్టార్‌ వరకు వెళ్లిదంటే అది సుకుమార్‌గారే కారణం''ని అల్లు అర్జున్ పేర్కొన్నారు. నా జీవితంలో చాలా తక్కువ మందికి 'రుణపడి ఉన్నానని చెబుతాను.

తాత అల్లు రామలింగయ్య, తలి దండ్రులు, చిరంజీవి... ఆ తరవాత తాను రుణ పడి ఉన్న వ్యక్తి సుకుమార్‌ అని అల్లు అర్జున్ అన్నారు. ''ఆర్య అయిపోయిన నాలుగైదు ఏళ్ల తరవాత ‘పరుగు’ సినిమా చేస్తున్నపుడు 85 లక్షలతో ఎస్‌ సిక్స్‌ కారు కొనుక్కున్నాను. ఆ కారు స్టీరింగ్‌ పట్టుకుని ఆలోచించాను. నేను ఇంత దూరం రావడానికి ఎవరెవరు కారణమై ఉంటారని ఆలోచిస్తే... నా మైండ్‌లో తట్టిన ఫస్ట్‌ వ్యక్తి సుకుమార్‌ గారు. డార్లింగ్‌...నువ్వు లేకపోతే, నేను లేను'' అని అంటున్నపుడు అల్లు అర్జున్‌ కన్నీళ్ళు వచ్చేశాయి.  బన్నీ ఆ మాటలు అంటున్నపుడు సుకుమార్ కూడా భావోద్వానికి గురయ్యారు. యావత్ భారతదేశం నన్ను ఐకాన్ స్టార్ గా గుర్తిస్తున్నారంటే సుకుమారే కారణం.. సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అల్లు అర్జున్ అన్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

బదిలీల విషయంలో  ప్రభుత్వ తీరుపై టీచర్ల ఆగ్రహం

మల్లన్నసాగర్ అక్రమాలపై హైకోర్టులో పిటిషన్

బంగారు తెలంగాణలో అన్ని చార్జీలు పెరిగినయ్