మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌.. హెలికాప్టర్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు

మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌.. హెలికాప్టర్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు

ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాలకు దేవుడిగా మారుతున్నారు సీఎం జగన్  (CM Jagan ).. ఇప్పటికే పేదల కోసం పలు సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) ప్రవేశపెట్టిన ఆయన.. సాయం అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటున్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అభయహస్తమిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు తన మానవత్వం చాటుకున్నారు. తాజాగా మరోసారి సీఎం చలించిపోయారు.


 రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు బ్రెయిన్ డెడ్‌ కాగా.. అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ విషయం సీఎం జగన్‌ దృష్టికి రాగా వెంటనే స్పందించిన ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్‌ను వారి కోసం ఏర్పాటు చేయించారు. చనిపోయిన వ్యక్తి గుండెను హెలికాఫ్టర్‌లో గుంటూరు నుంచి  తిరుపతి పద్మావతి ఆసుపత్రికి తరలించారు. సీఎం జగన్‌ వెంటనే స్పందించి తీసుకున్న చొరవను అందరూ అభినందిస్తున్నారు. 

గుంటూరుకు చెందిన కృష్ణ(19) యువకుడు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో .... అతను చనిపోయినట్లు గుంటూరు రమేష్‌ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు  అంగీకరించారు. ఈ క్రమంలో మృతి చెందిన యువకుడి గుండెను తిరుపతి లోని శ్రీ పద్మావతి చిల్డ్రన్న్స్ హార్ట్ కేర్ హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని భావించిన సీఎం జగన్  హెలీకాప్టర్ ద్వారా తరలించేందుకు  గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు. గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు సీఎం జగన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Also Read :- గేర్ మార్చాల్సిన అవసరం ఉంది: సీఎం జగన్

 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు హెలికాప్టరు ఏర్పాటు చేయడంతో వెంటనే మృతుని గుండెను తిరుపతికి హుటాహుటిన తీసుకెళ్లారు.  ఇక లివర్  విశాఖపట్నానికి , గుంటూరు , విజయవాడ ఆసుపత్రులకు కిడ్నీలను తరలించారు.  కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్‌ను తిరుపతి పద్మావతి ఆసుపత్రి వైద్యులు చేస్తున్నారు. తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పేదలకు కేవలం కార్పొరేట్ వైద్యం అందించడమే గాక.. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేయని అద్భుతాలు తన మంచి హృదయంతో చేయగలనని  సీఎం జగన్ చాటి చెప్పారు.