నిజామాబాద్ జిల్లాలో లైసెన్స్​డ్​ సర్వేయర్ల కోసం కసరత్తు షురూ

నిజామాబాద్ జిల్లాలో లైసెన్స్​డ్​ సర్వేయర్ల కోసం కసరత్తు షురూ
  • 2 నెలల ట్రైనింగ్​ ఇచ్చి నియామకాలు
  • ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో లైసెన్స్​డ్​ ల్యాండ్​ సర్వేయర్లను నియమించేందుకు కసరత్తు మొదలయ్యింది. భూభారతి స్కీమ్ ద్వారా భూసమస్యలను పరిష్కరించేందుకు రైతుల భూమి కొలతలు తీయాల్సిఉంది. సర్వేయర్ల కొరత కారణంగా లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్​ సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికయిన లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్​ సర్వేయర్లకు జిల్లాలోని పర్మనెంట్​సర్వేయర్లు ఈనెల 26 నుంచి జులై 26 వరకు శిక్షణ ఇస్తారు. వారికి ఎగ్జామ్స్​, అసెస్​మెంట్​ టెస్ట్​నిర్వహించి భర్తీ చేయనున్నారు.

అర్హతలివే.. 

ఈ నెల 17 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్నవారు ఈ పోస్ట్​కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్ల సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్​లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్​పాస్ అయి ఉండాలి. సెకండరీ ఎడ్యుకేషన్​ బోర్డు నిర్వహించిన సివిల్​ ట్రేడ్​లో గానీ, పాలిటెక్నిక్​లో సివిల్​ ఇంజినీరింగ్​ డిప్లొమాగానీ, సర్వేయర్​ ఎస్టిమేటర్​ కోర్సులో గానీ పాస్​ కావాలి. ఆల్​ ఇండియా సర్వేయర్ల సంస్థ ఆధ్వర్యంలోని ఇంటర్మీడియేట్​ ల్యాండ్​ సర్వేయింగ్​లో సర్టిఫికేట్​ పొందిన వారు, వొకేషనల్​ కాలేజీలో కన్​స్ట్రక్షన్​ టెక్నాలజీ, వాటర్​ సప్లై, శానిటరీ ఇంజినీరింగ్​, ల్యాండ్​ సర్వేయర్​కోర్స్​పూర్తి చేసిన వారు ఈనెల 17 వరకు ఆన్​లైన్​లో అప్లికేషన్​పెట్టుకోవాలి. 

రాష్ట్రంలో 5 వేల మంది లైసెన్స్​డ్​సర్వేయర్లను నియమించనున్నారు. జిల్లాకు 150 మందిని నియమిస్తారు. పర్మనెంట్​ సర్వేయర్ల దగ్గర రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఆతర్వాత మూడు అంశాల్లో పరీక్ష పెడతారు. కనీసం 70 శాతం మార్కులు వచ్చిన వారినుంచి మెరిట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు 40 రోజుల అప్రెంటిస్​లుగా పని చేసిన తర్వాత అసెస్​మెంట్​టెస్ట్​ నిర్వహిస్తారు. ఈ టెస్ట్​లో పాస్​ అయితేనే లైనెన్స్​ ఇచ్చి సర్వేయర్​గా నియమిస్తారు. భూభారతి చట్టం అన్ని మండలాల్లో అమలులోకి వచ్చే సమయానికి లైనెన్స్​డ్​ సర్వేయర్ల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో 33 మండలాలుండగా.. మండలానికి నలుగురి చొప్పున వీరిని నియమిస్తారు. 

అర్హతలున్నవారు అప్లై చేసుకోవాలి

భూభారతి స్కీమ్​లో లైనెన్స్​డ్​ సర్వేయర్ల అపాయింట్​మెంట్​కు చర్యలు తీసుకుంటున్నాం. అర్హతలున్న వారు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్​ ఆధారంగా భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

రాజీవ్​గాంధీ హనుమంతు, కలెక్టర్