ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి (NH 40)పై శిరివెళ్ళ మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైరు పేలడంతో .. కంటైనర్ లారీని భయంకరంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న AR BC VR ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కాలి బూడిదగా మారిపోయింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగగా, స్థానిక డీసీఎం డ్రైవర్ అద్దాలు పగులగొట్టడంతో 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
అతివేగం... రాత్రి దృష్టిపై జాగ్రత్త లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు, డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు. సంఘటన స్థలానికి నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్, ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
