మెస్సీ మెరిసె.. అర్జెంటీనా నిలిచె

మెస్సీ మెరిసె.. అర్జెంటీనా నిలిచె

దోహా (ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌):  వరల్డ్​ కప్​ లో తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనామక సౌదీ అరేబియా చేతిలో ఓటమితో అర్జెంటీనా జట్టులో అంతా నిరాశలో ఉన్నారు. ఇప్పుడు  బలమైన మెక్సికోతో చావోరేవో లాంటి పోరు. ఎంత ప్రయత్నించినా ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాలేదు. ప్రత్యర్థి డిఫెన్స్ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాకు దారి తీసేలా కనిపిస్తోంది.  స్టేడియంలో 88 వేల పైచిలుకు ప్రేక్షకులు.. టీవీల ముందు కోట్లాది మంది అభిమానుల్లో ఆందోళన మొదలైంది..! ఇలాంటి టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెస్సీ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.  25 గజాల దూరం నుంచి ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిక్​తో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టి జట్టులో జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నింపిన అతను మరో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. పనైపోయిందనకున్న అర్జెంటీనాకు ప్రాణం పోశాడు. మెస్సీ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపంచం ఫిదా అయిన వేళ  శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సి పోరులో అర్జెంటీనా 2–0తో మెక్సికోను ఓడించింది. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ప్రస్తుతం గ్రూప్​–సిలో 3 పాయింట్లతో అర్జెంటీనా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది.  గురువారం జరిగే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపర్ పోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4 పాయింట్లు)తో మెస్సీసేన తలపడుతుంది. మరోవైపు గ్రూప్​ చివరి ప్లేస్​లో ఉన్న మెక్సికో  ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటమితో నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. 

లియోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అర్జెంటీనా బలంగా పుంజుకుంది. అదే సమయంలో మెక్సికో సైతం తొలి విజయం కోసం పట్టుదల చూపెట్టింది. ఇరు జట్లూ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. రెండు జట్ల  డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ పోరులోనూ ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఒక్క గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాలేదు. కానీ, సెకండాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అర్జెంటీనా రెచ్చిపోయింది. పూర్తి కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటాకింగ్ గేమ్ తో మెక్సికన్లకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విసిరింది. ఈ క్రమంలో ప్రత్యర్థి బాక్స్​ దగ్గరికి వెళ్లిన మెస్సీ 64వ నిమిషంలో టీమ్​ మేట్​ డి మరియా నుంచి పాస్​ అందుకున్నాడు. తన చుట్టూ, ఎదురుగా ఉన్న ప్లేయర్లతో పాటు ప్రత్యర్థి గోల్​ కీపర్​ను తప్పిస్తూ 25 గజాల దూరం నుంచి అద్భుతమైన గ్రౌండ్​ షాట్​తో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపడంతో స్టేడియం మొత్తం హోరెత్తింది. మెక్సికో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం మెస్సీ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మెక్సికన్లు స్కోరు సమం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అర్జెంటీనా డిఫెండర్లు, గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిప్పికొట్టాడు. మరోవైపు  87 వ నిమిషంలో లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మెస్సీ అందించిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్న ఎంజో ఫెర్నాండేజ్ బలమైన షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతూ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడటంతో అర్జెంటీనా ఆధిక్యం డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. ఆపై, ఎంత ప్రయత్నించినా మెక్సికో స్కోరు చేయలేకపోవడంతో మెస్సీసేన విజయం సొంతం చేసుకుంది. 

మారడోనా సరసన మెస్సీ

ఈ టోర్నీ రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ గోల్స్‌‌‌‌ కొట్టిన లియోనల్‌‌‌‌ మెస్సీ ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌లో ఎనిమిది గోల్స్‌‌‌‌ రాబట్టాడు. దాంతో, అర్జెంటీనా తరఫున ఎక్కువ గోల్స్‌‌‌‌ సాధించిన  లెజెండ్‌‌‌‌ డీగో మారడోనా రికార్డు సమం చేశాడు. మారడోనా కూడా ఎనిమిది గోల్స్‌‌‌‌ కొట్టగా.. అదే దేశానికి చెందిన మరో లెజెండ్‌‌‌‌ గాబ్రియెల్‌‌‌‌ బటిస్టుటా 10 గోల్స్‌‌‌‌తో టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా ఉన్నాడు. అలాగే, వరల్డ్​కప్​లో అర్జెంటీనా తరఫున అత్యధికంగా  21 మ్యాచ్​లు ఆడిన మారడోనా రికార్డు కూడా మెస్సీ సమం చేశాడు.

88,966 మంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ది లుసైల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు 88,966 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దాంతో, 28 ఏండ్లలో అత్యధిక మంది అటెంట్‌‌‌‌‌‌‌‌ అయిన వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా రికార్డు కెక్కింది. కాలిఫోర్నియాలోని రోస్‌‌‌‌‌‌‌‌బౌల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో బ్రెజిల్‌‌‌‌‌‌‌‌, ఇటలీ మధ్య జరిగిన  1994 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు 91, 194 మంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చారు. 1,73, 850 మంది ప్రేక్షకులతో   1950లో బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ మరాకానా స్టేడియంలో ఉరుగ్వే, బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ అత్యధిక మంది హాజరైన వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది.