దళితులపై దాడులను అరికట్టేందుకు సీఎంతో మీటింగ్ : బక్కి వెంకటయ్య

 దళితులపై దాడులను అరికట్టేందుకు సీఎంతో మీటింగ్ : బక్కి వెంకటయ్య
  • బక్కి వెంకటయ్య

బషీర్​బాగ్, వెలుగు: దళితులపై దాడులను ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఇటీవల మెదక్ జిల్లా హవేలిఘనాపూర్ మండలం బూర్గపల్లి జడ్​పీ హైస్కూల్​లో గిరిజన ఇంగ్లిష్ టీచర్ నరేందర్ నాయక్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ వెంకటేశ్​చౌహన్, గిరిజన జేఏసీ లీడర్​ రాజేశ్​నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బక్కి వెంకటయ్య మాట్లాడారు. 

ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టేందుకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్​ కె.లక్ష్మినారాయణ, కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, నాయకులు శ్రీరాములు, రాజేందర్, అశోక్  తదితరులు పాల్గొన్నారు.