దళితులు  మోసపోకుండా చైతన్య కార్యక్రమాలు

దళితులు  మోసపోకుండా చైతన్య కార్యక్రమాలు
  • రేపటి నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు
  • ఈనెల 9న కలెక్టరేట్ ల ముందు ధర్నా
  • ఈనెల 15న అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మహా దీక్షలు
  • ఈనెల 16 నుంచి దళిత చైతన్య యాత్రలు
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ

యాదాద్రి: దళితులు పదేపదే మోసపోకుండా ఊరూరా.. వాడవాడలా.. చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఈనెల 9వ తేదీ నుండి ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ఆదివారం భువనగిరి బంగరిలో మంద కృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను చైతన్య పరిచే కార్యక్రమాలలో భాగంగా రేపటిం నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు ప్రారంభమవతాయన్నారు. ఈనెల ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ల ముందు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఈనెల 15న అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మహా దీక్షలు, ఈనెల 16 నుంచి దళిత చైతన్య యాత్రలు మొదలుపెడతామని మందకృష్ణ వివరించారు. దళిత బంధు పేరుతో దళితులను  మరోసారి మోసం  చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో దళితులు మోసపోకుండా దళిత చైతన్య సదస్సులు నిర్వహించనున్నామని  ఆయన తెలిపారు. 
19 శాతం ఉన్న దళితులకు 19 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
తెలంగాణలో దళితులు 19 శాతం ఉన్నందున.. దళితుల సంక్షేమం కోసం 19 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీని లక్ష  నాగళ్ల తో దున్నుతా అన్నాడు, తెలంగాణ లో తొలి దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు మూడు ఎకరాల పంపిణీ చేస్తా అన్నాడు.. అవన్నీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత   దళితుల భూములు తీసుకొని రైతు వేదికలు,   స్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు,  సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నిర్మాణం తదితర ప్రభుత్వ నిర్మాణాల కోసం దళితుల భూమి కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని ఆయన విమర్శించారు. దళితులను మేలుకొలపడం, దళితులను పోరాటానికి సిద్ధం చేయడం మా యొక్క కార్యాచరణ అన్నారు. 
దళితబంధును హుజూరాబాద్ లో ఎన్నికలకు ముందే అమలు చేయాలి
దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్ల కంటే ముందే అమలుచేయాలని మందకృషణ మాదిగ డిమాండ్ చేశారు. ఎన్నికలు అయిపోయిన 100 రోజుల్లో 119 నియోజక వర్గాలలో అమలుచేయాలన్నారు. సెప్టెంబర్ 5న హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. దళిత పేద వర్గాల మీద పోలీసుల దాడులు జరుగుతున్నాయని, కారకులను సస్పెండ్ చేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం తో పాటు వారిపై కేసు నమోదు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.