హైదరాబాద్, వెలుగు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తన ఏడబ్ల్యూఎస్ మార్కెట్‌ప్లేస్‌ను భారతదేశంలో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణతో ఇక నుంచి భారతదేశంలోని కస్టమర్‌లు సిస్కో, క్రౌడ్‌స్ట్రైక్, సేల్స్‌ఫోర్స్ లాంటి టెక్నాలజీ ప్రొవైడర్ల నుంచి సాఫ్ట్‌వేర్ సేవలను రూపాయల్లో కొనుగోలు చేయవచ్చు.
దీని ద్వారా స్థానిక ఇన్వాయిసింగ్ సాధ్యమవుతుంది. ఇండియాకు చెందిన ఐఎస్వీలు (ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ వెండర్స్) కన్సల్టింగ్ భాగస్వాములు తమ ఉత్పత్తులను రూపాయల్లోనే అమ్మవచ్చని తెలిపింది. దీనివల్ల పన్ను ఇబ్బందులు తగ్గుతాయని, ఈ కొత్త విధానం భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచుతుందని ఏడబ్ల్యూఎస్ తెలిపింది.
