
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హనుమకొండ జిల్లా ఎర్రగట్టు గుట్ట ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కాలేజీ డైరెక్టర్ బి. గట్టయ్య యాదవ్డాక్టరేట్ అందుకున్నారు. సీనియర్ ప్రొఫెసర్ డి. చెన్నప్ప పర్యవేక్షణలో ‘నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ తెలంగాణ - స్టడీ ఆఫ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ్ స్టేట్’ అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు.
దీనిపై గట్టయ్య సమర్పించిన థీసిస్‌ను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పరిశీలించి, పీహెచ్‌డీ ప్రదానం చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా గట్టయ్యను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వివిధ విద్యా సంస్థల యాజమాన్యులు అభినందించారు.