సెక్రటేరియట్ బిల్డింగ్​ను కూల్చేయండి : బక్క జడ్సన్

సెక్రటేరియట్ బిల్డింగ్​ను కూల్చేయండి : బక్క జడ్సన్
  • కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ఉన్న సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ, హైడ్రా ఆఫీసులను కూల్చివేయాలని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలోని భవనాలను కూల్చేస్తున్న హైడ్రా వీటిని కూడా కూల్చాలన్నారు. సోమవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు.

హైడ్రా సమన్వయంతో పని చేయడం లేదని ఆరోపించారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లతో కలిసి పని చేయాల్సి ఉన్నప్పటికీ హైడ్రా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. హుస్సేన్ సాగర్ ను ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం జీహెచ్ఎంసీ, హైడ్రా, సెక్రటేరియట్​వద్ద ‘RB–X’  స్టిక్కర్లు అంటించి నిరసన తెలిపారు.