ధరలు విపరీతంగా పెరిగాయి.. కూరల్లో నూనె తగ్గించండి: ప్రధాని మోదీ

ధరలు విపరీతంగా పెరిగాయి.. కూరల్లో నూనె తగ్గించండి:  ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం, వాణిజ్య, సరఫరాలో ఉన్న అంతరాయాల కారణంగా భారతీయులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు మోదీ. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి కారణంగా సప్లై చైన్ దారుణంగా పడిపోయిందని.. ఈ సందర్భంగా వివిధ వస్తువుల వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు. 2026 మే 10వ తేదీన హైదరాబాద్ లో జరిగిన సభలో మాట్లాడుతూ.. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. 

వంటనూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. వాణిజ్య సరఫరా అంతరాయంతో దిగుమతి ఇబ్బందవుతుందన్నారు. దీనికి తోడు యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చితితో ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో వంటల్లో నూనెల వినియోగాన్ని కాస్త తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బంది కర పరిస్థితులున్నాయన్నారు మోదీ. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి  బయట పడాలంటే.. ఇండియన్స్ బాధ్యతతో కూడిన జీవిన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. అనవసర ఖర్చులు పెట్టొద్దని కోరారు. 

►ALSO READ | పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: ప్రధాని మోడీ కీలక ప్రకటన

ఇక చాలా దేశాల్లో యూరియా బస్తా ధర రూ.3 వేలు ఉందని.. భారత్‌లో రూ.300లోపే ఉందన్నారు. ఎరువుల వినియోగం తగ్గించి.. భూసారం పెంచుదామని పిలుపునిచ్చారు.. అన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోగలమని తెలిపారు. 

నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా ఉండాలని కోరారు. అవే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలనిన విజ్ఞప్తి చేశారు. స్వదేశీ కేవలం భాజపా నినాదం కాదు.. ఇది దేశ విధానం కావాలని పిలుపునిచ్చారు.