పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: ప్రధాని మోడీ కీలక ప్రకటన

పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: ప్రధాని మోడీ కీలక ప్రకటన

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రైళ్లు ఎలక్ట్రికల్కు మారడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం రైల్వేలో భారీగా తగ్గిందని చెప్పారు.

పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రపంచ మార్కెట్లో భారీగా పెరుగుతోందని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై విదేశీయుల ముద్ర ఉండకూడదని, అందుకే వినియోగం తగ్గించి ఇతర దేశాలపై మనం ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. గోల్డ్ రేట్లు కూడా పెరిగాయని, ఆపద సమయాల్లో, యుద్ధం వస్తే గతంలో దీన్ని ఉపయోగించేవాళ్ళని.. కానీ ఇప్పుడు ప్రతి ఫంక్షన్ కు వాడుతున్నారని ప్రధాని మోడీ చెప్పారు.