కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సత్కరించారు. రాహుల్కు విజయ్ శాలువా కప్పి సత్కరించిన వీడియో సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్లో నిలిచింది. రాహుల్ గాంధీ తనను విజయ్ సత్కరించిన వీడియోను ఆయన ఫేస్ బుక్ పేజ్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ గురించి ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. బిగ్ బ్రదర్ అని సంభోదించారు. దీంతో.. తమిళ తంబీ విత్ బిగ్ బ్రదర్ వీడియో అని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే 2 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. దాదాపు 2 మిలియన్ లైక్స్ వచ్చాయి. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై రాహుల్ స్పందిస్తూ.. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని, ఆ మార్పును తీసుకురావడానికి విజయ్ ఉన్నారని చెప్పుకొచ్చారు.
►ALSO READ | ధరలు విపరీతంగా పెరిగాయి.. కూరల్లో నూనె తగ్గించండి: ప్రధాని మోదీ
ఈ ప్రయాణంలో ఆయనకు అండగా నిలుస్తానని, మద్దతు ఇస్తానని విజయ్ విషయంలో కాంగ్రెస్ సానుకూల వైఖరిని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. టీవీకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు కలిసి మరింత బలమైన, ప్రగతిశీలమైన తమిళనాడును నిర్మిస్తాయని రాహుల్ గాంధీ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
