వారఫలాలు(మే10–16 ) : ఈ వారం ఎవరికి కలిసివస్తుంది..12 రాశుల వారికి  ఎలా ఉండబోతుంది.. 

వారఫలాలు(మే10–16 ) : ఈ వారం ఎవరికి కలిసివస్తుంది..12 రాశుల వారికి  ఎలా ఉండబోతుంది.. 

వారఫలాలు ( 2026 మే 10– 16  )  :  ఈ వారం  గ్రహాల సంచారం ఎలా ఉంది.. ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.  ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం..!

మేషరాశి:  ఈ వారం ఈ రాశి వారికి అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అనవసరమైన విషయాలకు వెళ్లవద్దు.  వ్యాపారస్తులకు పోటీ ఎక్కువుగా ఉంటుంది.  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఉద్యోగస్తులకు ఆత్మవిశ్వాశం పెరుగుతుంది. సహోద్యోగులతో.. అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు. 

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి.  ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు . ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిదని పండితులు అంటున్నారు. ఉద్యోగులకు ఈ వారం సానేకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.

మిధున రాశి: ఈవారం  ఈ రాశి  వారు ప్రతి విషయంలో కూడా పోటీ ఎదుర్కోవలసి వస్తుంది.  కష్ట పడికా కాని ఫలితం మీ వైపే ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉంటారు.  ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులకు పరిష్కారం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ముఖ్యమైన నిర్ణయాల విషయంలో పెద్దల సలహాలు తీసుకోండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దని పండితులు సూచిస్తున్నారు

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనులను కష్టంతోనే పూర్తి చేసుకోగలుగుతారు.  వ్యాపారపరమైన శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్య వర్తులను ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

సింహరాశి: ఈ వారం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా గడుస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయపరంగా కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు  గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనిలో మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని నిరూపించుకునే కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు

కన్య రాశి: ఈవారం ఈ రాశి వారు  చాలా ప్రశాంతంగా ఉంటారు.  ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు.  మంచి ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉన్నతాధికారులు సహకారం ఉంటుంది.  కార్యాలయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.  ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి: ఈ వారం ఈ రాశి వారికి కొత్తగా వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది.  టెక్నికల్ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్​వచ్చే  అవకాశం ఉంది. నిరుద్యోగుల  ప్రయత్నాలు ఫలిస్తాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ వారం తలపెట్టిన పనులకు పూర్తి చేసుకోగలుగుతారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు వస్తాయి.  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఈ రాశి ఉద్యోగస్తులకు మాత్రం ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యవిషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పండితులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు  కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లొద్దు.జాయింట్​ వ్యాపారస్తులకు  ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.  . ఉద్యోగస్తులు పనిపై దృష్టి పెట్టడం చాలా మంచిది.  సహోద్యోగులతో ఇతర విషయాలు చర్చించవద్దు. అనవసరమైన విషయాల్లో అసలు తలదూర్చకండి. . ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 

మకర రాశి: ఈవారం ఈ రాశి వారు కొత ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో  భారీగా లాభపడతారు. అనూహ్యమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులు  చాలా సంతోషంగా గడుపుతారు.  అధికారుల మద్దతు లభించడంతో కీలకమైన బాధ్యతలు చేతికి వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి

కుంభరాశి: ఈ వారం ఈ రాశి వారికి  మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనుల్లో అనుకోని ఇబ్బందులుఉంటాయి. వ్యాపారస్తులకు లాభం లేకపోయినా నష్టం ఉండదు.  కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. పని విషయంలో ఎంత ఒత్తిడి ఉన్నా.. అసంతృప్తి చెందవద్దు.  సైలెంట్​ గా మీ పని మీరు చేసుకోండి .   అధికారులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. సహోద్యోగుల దగ్గర పై అధికారుల గురించి కామెంట్లు చేయవద్దు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి

మీన రాశి: ఈవారం  ఈ రాశి వారికి  సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది.  కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంది.  ముఖ్యమైన బాధ్యతలతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.  తొందరపడి ఎవరితోనూ మాట్లాడవ్దు. ఆవేశానికి..  కోపానికి .. వాదనలకు  దూరంగా ఉండండి.  వారాంతంలో బంధుమిత్రుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.